- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పెళ్లి టైం వేస్ట్!'.. సోషల్ మీడియా స్టార్‌గా మారిన మోడ్రన్ కేవ్‌మ్యాన్.. అసలు ఎవరితను?
నేటితరం యువత సిటీ లైఫ్‌కు విపరీతంగా అలవాటు పడిపోయారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు, షీకార్లు వారి జీవన శైలిలో భాగమైపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: నేటితరం యువత సిటీ లైఫ్‌కు (City life) విపరీతంగా అలవాటు పడిపోయారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు, షీకార్లు వారి జీవన శైలిలో భాగమైపోయాయి. అంతేకాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ డ్రీమ్‌గా భావిస్తుంటారు. అలాంటిది.. 'ఇదంతా టైమ్ వేస్ట్!' అంటూ ఓ యువకుడు ఎవరు ఊహించలేని నిర్ణయం తీసుకున్నాడు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, అతడిని సోషల్ మీడియా స్టార్‌ను (Social media star) కూడా చేసింది. మరీ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
చైనా (China) దేశంలోని శిఛువాన్ (Sichuan) ప్రావిన్స్‌కు చెందిన మిన్ హెంగ్‌కై (Min Hengcai) అనే 35 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. హెంగ్‌కై గతంలో ఒక రైడ్-హెలింగ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూ నెలకు దాదాపు US $1400 సంపాదించేవాడు. అయితే, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు.. తదితర పరిస్థితులపై విసుగు చెంది 2021లో ఉద్యోగం వదిలేసి అందరిని ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన స్వగ్రామంలో ఉండే ఓ చిన్న గుహలోకి మకాం మార్చి దాన్నే తన నివాసంగా నూతన జీవనాన్ని ప్రారంభించాడు.
సుమారు 50 చదరపు మీటర్ల గుహను అతను తన ఇంటిగా తీర్చిదిద్దాడు. ఆ గుహకు బ్లాక్ హోల్‌గా పేరు పెట్టి.. స్నానం చేయడానికి టబ్, మురుగు నీరు బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు, తాగునీటి కోసం చిన్న డబ్బాలు.. ఇలా తనకు కావాల్సిన వాటితో సౌకర్యవంతంగా మార్చుకున్నాడు. అంతేకాదు, 'నిజమైన ప్రేమ దొరకటం చాలా అరుదు. పెళ్లి.. మనీ, టైం వేస్ట్!' అని హెంగ్‌కై పేర్కొన్నాడు. పెళ్లి, ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటూ, చిన్న పొలంలో పండ్లకాయలు పండించుకుంటూ, పుస్తకాలు చదువుతూ, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇతడి జీవన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇతడి లైఫ్ స్టైల్‌కు ఫీదా అయిన నెటిజన్లు 'మోడ్రన్ కేవ్‌మ్యాన్' అని పిలుస్తున్నారు.






