- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింత ఘటన.. ICU లోనే పెళ్లి.. షాకైన ఆసుపత్రి సిబ్బంది
కేరళలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కేరళలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వధూవరులిద్దరూ ఐసీయూలో పెళ్లి చేసుకోగా.. హాస్పిటల్ సిబ్బంది షాక్ అయ్యారు. తంబోలికి చెందిన వీఎం శరణ్, అలప్పుకి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. వధువును అలంకరణ కోసం తీసుకెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నవవధువుకు వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను కొట్టాయంలోని మెడికల్ కాలేజీకి చెందిన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్యం కోసం అక్కడి నుంచి కోచిలోని మరో ఆస్పత్రికి తరలించి, అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
అయితే అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని నిశ్చయానికి వచ్చిన ఇరు కుటుంబ సభ్యులు.. వైద్యులను సంప్రదించగా వారు అంగీకరించారు. ప్రైవేటు ఆసుపత్రి అత్యవసర విభాగం ఎమర్జెన్సీ గదిలోనే తాళి కట్టేలా ఏర్పాట్లు చేసారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అనుకున్న ముహూర్త సమయానికి వివాహం జరిపించారు. దీంతో ఆసుపత్రిలో మిగతా సిబ్బంది, రోగుల బంధువులు ఆశ్చర్యంగా చూసి... తర్వాత దంపతులను ఆశీర్వదించారు.






