- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుచ్చకాయ కొనేందుకు చాట్ జీపీటీ.. అబ్బబ్బ ఏం వాడకమయ్యా!
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఏ పని చేసినా ఫోన్‌తోనే చేస్తున్నారు.. స్మార్ట్‌గానే చేస్తున్నారు. ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఏఐ మరో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏఐ టూల్స్ ఉపయోగించి రకరకాల పనులు చేస్తున్నారు. కంటెంట్ రైటింగ్, ఫోటో ఎడిటింగ్, కోడింగ్ ఇలా చాలా పనులకు ఏఐ వినియోగం పెరిగిపోయింది.

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఏ పని చేసినా ఫోన్‌తోనే చేస్తున్నారు.. స్మార్ట్‌గానే చేస్తున్నారు. ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఏఐ మరో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏఐ టూల్స్ ఉపయోగించి రకరకాల పనులు చేస్తున్నారు. కంటెంట్ రైటింగ్, ఫోటో ఎడిటింగ్, కోడింగ్ ఇలా చాలా పనులకు ఏఐ వినియోగం పెరిగిపోయింది. ఇక తాజాగా ఏఐ టూల్ చాట్ జీపీటీ ఉపయోగించిన ఓ వ్యక్తి చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పుచ్చకాయలు కొనేందుకు కూడా ఆ వ్యక్తి చాట్ జీపీటీని ఉపయోగించాడు. పుచ్చకాయలు అమ్మే బండి దగ్గర వాటన్నింటిని ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోను చాట్ జీపీటీలో వేసి ఇందులో ఎర్రగా, తియ్యగా ఉన్న పుచ్చకాయను గుర్తించాలని కోరాడు.
దానికి చాట్ జీపీటీ ఓ పుచ్చకాయను గుర్తించగా అతడు దానిని తీసుకుని కట్ చేసి చూడగా నిజంగానే ఎర్రగా ఉంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏఐని చాలా రకాలుగా వినియోగిస్తున్నారు కానీ ఈ విధంగా ఎవ్వరూ వినియోగించలేదు. దీంతో వీడియోకు ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. ఓ వ్యక్తి ఈ వీడియోకు "బ్రదర్ భార్యల దగ్గర తిట్లు తినకుండా ఓ పరిష్కారం చూపించాడు" అని కామెంట్ చేశాడు. సాధారణంగా చాలా మందికి ఎలాంటి కూరగాయలు పండ్లు తీసుకోవాలో తెలియదు. దీంతో కనిపించినవి తీసుకెళ్లి భార్యలతో తిట్లు తింటారు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉపయోగించడం ద్వారా ఆ బాధలు తప్పే అవకాశం ఉంది.






