మానవత్వమే శాపం.. చేయని నేరానికి 13 నెలల జైలు

by Muthe.Rajitha |

మానవతా దృక్పథంతో ఓ మహిళకు సాయం చేయబోతే చివరికి తానే 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

మానవత్వమే శాపం.. చేయని నేరానికి 13 నెలల జైలు
X

దిశ, వెబ్ డెస్క్ : మానవతా దృక్పథంతో ఓ మహిళకు సాయం చేయబోతే చివరికి తానే 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. భోపాల్ పట్టణంలోని ఓ మురికి వాడలో నివాసం ఉంటున్న రాజేష్.. ఒకరోజు తమ పొరుగు ఇంటి మహిళా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించగా.. సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్ ను ప్రశ్నించారు. సరిగా సమాధానం చెప్పని రాజేష్ ఈ హత్య చేసాడని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

రాజేష్ అరెస్ట్ అయినట్టు 20 రోజుల వరకు కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అయితే ఇటీవల విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకువెళ్లడంతో.. కోర్టు రాజేష్ కు ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించింది. అసలు ఏం జరిగిందో చెప్పమని అడ్వొకేట్ కూపీ లాగగా.. ఆ మహిళకు అనారోగ్యంగా ఉంటె ఆసుపత్రిలో చేర్చానని, ఆమె చనిపోయిన విషయం కూడా తనకు తెలియదని వాపోయాడు. దీంతో న్యాయవాది ఆసుపత్రి వైద్యుల నుంచి రిపోర్టు కోరగా అందులో అనారోగ్యంతో మృతి చెందినట్టు ఉంది.

మరి ఆ మహిళా గొంతు ఎలా తెగిందని విచారిస్తే... పోస్టుమార్టంలో డాక్టర్ల అజాగ్రత్త వల్ల, పోలీసుల తప్పుడు ఆరోపణల వల్ల రాజేష్ చేయని నేరానికి 13 నెలలు జైలు జీవితం గడిపాడని తేలింది. కోర్టు అటు పోలీసులకు, డాక్టర్లకు చీవాట్లు పెట్టి రాజేష్ ను విడుదల చేసింది. అయితే విడుదలయ్యాక తన కుటుంబ సభ్యులు ఎటు వెళ్లారో తెలియడం లేదని, తానూ జైలుకు వెళ్లానని తెలిసి ఎవరూ పని ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నాడు.

Next Story