ఇటలీలో షాకింగ్ ఘటన.. మనిషిని లోపలికి లాగేసుకున్న విమానం ఇంజిన్

by Ajay Maddhiboyina |

ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఇంజిన్ ఓ మనిషిని లోపలికి లాగి ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని ఓరియో అల్ సెరియో విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

ఇటలీలో షాకింగ్ ఘటన.. మనిషిని లోపలికి లాగేసుకున్న విమానం ఇంజిన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఇంజిన్ ఓ మనిషిని లోపలికి లాగి ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని ఓరియో అల్ సెరియో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. రన్ వే పై టేక్ ఆఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో గ్రౌండ్ స్టాఫ్ అటుగా వెళ్లారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని ఇంజిన్ లోపలకి లాగేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 154 మంది ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. ఉద‌యం 10.20 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మృతుడు ఆ విమానంలో ప్ర‌యాణించడానికి వ‌చ్చిన ప్ర‌యాణికుడు కానీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా కాద‌ని తెలుస్తోంది. మృతుడు రాంగ్ డ్రైవింగ్ చేస్తూ త‌న కారు వ‌దిలిపెట్టి ట‌ర్మిన‌ల్ వైపు ప‌రిగెత్తుతూ వెళ్లిన‌ట్టు అక్క‌డ ఉన్న‌వాళ్లు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అరైవ‌ల్ ఏరియాలోకి ప్ర‌వేశించిన త‌ర‌వాత నేరుగా పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే త‌లుపు తీసుకుని ప‌రిగెత్తుకువ‌చ్చాడ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

Next Story