- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం ఎఫెక్ట్...వాటర్ ట్యాంకర్ లోనే పెట్రోల్ !
5000 లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకర్ లో పెట్రోల్ నింపేశాడు ఓ వ్యక్తి.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా వార్ ఎఫెక్ట్ ఇండియాపైన పడిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఇండియాలో చమురు కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే LPG కొరత ఏర్పడనున్న నేపథ్యంలో అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం. భారత దేశవ్యాప్తంగా 25% LPG ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా పెరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నమ్మి జనాలు, నెల లేదా రెండు నెలలకు సరిపడే పెట్రోల్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ వాహనాలు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా రాష్ట్రాలలో పెట్రోల్ బంకులు రద్దీతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అయితే, వాటర్ బబుల్స్ తీసుకువచ్చి మరీ.. పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వాటర్ ట్యాంకర్ లోనే పెట్రోల్
భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి 5000 లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకర్ లో పెట్రోల్ నింపేశాడు. తన ట్రాక్టర్ కు ఉన్న వాటర్ ట్యాంకర్ లోనే పెట్రోల్ పోసుకున్నట్లు వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఎవరైనా వాటర్ క్యాన్స్ లో పెట్రోల్ తీసుకువెళ్తారు కానీ.. ఇలా వాటర్ ట్యాంకర్ లోనే తీసుకుపోవడం వింతగా ఉందని ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే మేము కూడా పెట్రోల్ తెచ్చుకోవాల్సిందే అని, జనాలు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఐదు వేల లీటర్ల ట్యాంకర్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భవిష్యత్తులో పెట్రోల్ దొరకబోదని, తాము కూడా తెచ్చుకుంటామని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ కడుతున్నారు. వాస్తవంగా ఇండియాలో చమురు నిల్వలు ఇంకా ఉన్నాయని, పెట్రోల్ కొరత అసలు ఏర్పడబోదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకూడదని సూచనలు చేస్తున్నారు. క్లిక్






