VIRAL: వామ్మో.. కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. ఒక్కసారిగా హడలిపోయిన డాక్టర్లు

by Prasad Jukanti |

బతికున్న పామును ఆసుపత్రికి తేవడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు.

VIRAL: వామ్మో.. కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. ఒక్కసారిగా హడలిపోయిన డాక్టర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాము కనిపిస్తే ఆమడ దూరం పరుగెత్తుతాం. అదే కాటేస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది ఓ వ్యక్తి తనను కాటేసిన పామును జాగ్రత్తగా తనతో పాటే ప్రాణాలతో ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు. ఈ పాము తనను కాటేసిందని తనకు వైద్యం చేయాలని డాక్టర్లను కోరాడు. ఇంకేముంది అతడి చర్యలకు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‍గా మారింది. యూపీలోని మధుర ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రిక్షా నడుపుకునే దీపక్ (39) వచ్చాడు. ఏ పాము కుట్టిందో తెలిస్తే వైద్యం సులువవుతుందని భావించి అతడు తన జాకెట్ లోపల బ్రతికున్న నాగుపామును వెంట తెచ్చాడు. అతను జిప్ తీసి పామును చూపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. దీపక్ ను పాము సోమవారం కరిచిందని అతడు నిన్నే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకున్నాడని తెలిపారు.

Next Story