- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనిషిని చూసి పారిపోయిన సింహం.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది గురూ
సాధారణంగా పులి లేదా సింహం మీకు ఎదురుపడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పులి లేదా సింహం మీకు ఎదురుపడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. అర్జంటుగా దానికి దూరంగా పారిపోవాలనుకుంటారు కదా. పులికో, సింహానికో మనిషి లేదా వేరే ఏదైనా జంతువు ఎదురుపడినపుడు వెంటనే దాడి చేస్తాయి. కానీ.. ఓ వీడియోలో మాత్రం సింహం, మనిషి ఎదురుపడినపుడు ఒకరినొకరు చూసుకుని పరుగు లంకించారు. ఆ వ్యక్తి అంటే సింహాన్ని చూసి భయపడ్డాడు. మరి సింహం ఎందుకు పారిపోయిందన్నదే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం.
రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో సింహం ఒక పక్క, మనిషి ఇంకో పక్క నడుస్తూ వస్తున్నారు. మధ్యలో చిన్న బిల్డింగ్ అడ్డుగా ఉంది. ఇద్దరూ దానిని దాటి ఒకరినొకరు చూడగానే భయంతో పరుగు తీశారు. జునాగఢ్ లో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన జరగ్గా అది కాస్తా అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. సింహం మనిషిని చూసి భయపడిందా అంటే.. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరూ లేని ప్రశాంతంగా నడుస్తూ పోతున్న దానికి.. అకస్మాత్తుగా ఒక వ్యక్తి కనిపించేసరికి భయపడిందని చెప్పొచ్చు. అయితే దీనిని సుశాంత నంద ఎలిమెంట్ ఆఫ్ సర్‌ప్రైజ్‌గా చెప్పారు.
Worker of the cement factory at Junagarh & a free roaming lion accidentally meet each other. Both panic.
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) August 10, 2025
You have just witnessed the rare reverse chase 😀 pic.twitter.com/W4ps2NJl0S






