మమతా బెనర్జీ చేతికి మూడు ఫిట్‌నెస్ వాచీలు.. అలా ఎందుకో తెలుసా?

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 07:51:56  IST  )

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం వేళ ఒకేసారి మూడు ఫిట్‌నెస్ ట్రాకర్లు ధరించి కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

మమతా బెనర్జీ చేతికి మూడు ఫిట్‌నెస్ వాచీలు.. అలా ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ కిలోమీటర్ల మేర నడక (Bracing Walk) ఆమె దినచర్యలో భాగం. అయితే, ఇటీవల ఆమె ఒకేసారి మూడు ఫిట్‌నెస్ ట్రాకర్లు ఉన్న స్మార్ట్‌వాచీలు ధరించి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మూడు వాచీలు ఎందుకు?

సాధారణంగా ఎవరైనా ఒక వాచీ పెట్టుకుంటారు. కానీ మమతా బెనర్జీ మూడు వాచీలు ధరించడం వెనుక ఉన్న కారణాలపై సోషల్ మీడియా (Social Media)లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది అంత అసాధారణమైన విషయం ఏమీ కాదు. వేర్వేరు బ్రాండ్ల ఫిట్‌నెస్ ట్రాకర్లు వేర్వేరు రీడింగ్‌లను ఇస్తుంటాయి. స్టెప్ కౌంట్, హార్ట్ రేట్ వంటి వివరాల్లో ఖచ్చితత్వాన్ని పోల్చి చూసుకోవడానికి కొందరు ఇలా చేస్తుంటారు.

సోషల్ మీడియాలో ‘దీదీ’ ఫోటోలు వైరల్..

అయితే, ఒక్కో వాచీలో ఒక్కో రకమైన హెల్త్ ఫీచర్ ఉదాహరణకు ఒకటి స్లీప్ ట్రాకింగ్ (Sleep Tracking), మరొకటి ఈసీజీ మెరుగ్గా ఉండవచ్చు. ఆ సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకోవడానికి ఇలా ధరిస్తుంటారని తెలుస్తోంది. ఇక ఒక వాచీ ఛార్జింగ్ అయిపోయినా లేదా సాంకేతిక సమస్య వచ్చినా, మరో వాచీలో డేటా రికార్డ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా కొందరు మల్టిపుల్ ట్రాకర్లను వాడుతుంటారు. మమతా బెనర్జీ ట్రేడ్‌మిల్‌, రోడ్డుపై ప్రతిరోజూ కనీసం 10 నుంచి 12 కి.మీ మేర నడుస్తారు. విదేశీ పర్యటనల్లో కూడా ఆమె తన నడకను ఆపరు. అందుకే తన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించుకోవడానికి ఆమె ఈ టెక్నాలజీని వాడుతున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం మూడు ఫిట్‌నెస్‌ వాచ్‌లు ధరించిన మమతా బెనర్జీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Next Story