- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రమ్స్ వాయించి దుమ్ములేపిన మల్లారెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పబ్లిక్ ఫిగర్.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పబ్లిక్ ఫిగర్. టీడీపీ (TDP) ఎంపీగా పొలిటికల్ ఎంట్రీగా ఇచ్చిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగానూ సేవలందించారు. వ్యాపారాన్నే నమ్ముకుని అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి పలు రాష్ట్రంలో పలు విద్యా సంస్థలు, ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆయన ఏది చేసినా.. సంచలనమే. తాజాగా, మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా పోచారంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగకు హాజరయ్యారు. అనంతరం ఫలహారం బండి ఊరేగింపులో భాగంగా ఆయన సందడి చేశారు. ఏకంగా డ్రమ్స్ (Drums) వాయించి కార్యక్రమానికి హాజరైన భక్తులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి.. https://x.com/bigtvtelugu/status/1949679562842833369






