- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం ఇవ్వలేక.. ఐఏఎస్ కాళ్ల మీద పడి ఏడ్చిన రైతు(వీడియో)
దేశానికి అన్నం పెట్టేది రైతన్నే. అందరి కన్నా వెనుబడింది ఆయనే. పంట సరిగ్గా పండితే గిట్టుబాటు ధర ఉండదు. వరుడు కరుణించకపోతే ఆ మాత్రం పంట కూడా ఉండదు. ఈ సారి పంటపై వచ్చే డబ్బులతో కష్టాలన్నీ తీరపోతాయని ఆశపడ్డా..

దిశ, వెబ్ డెస్క్ : దేశానికి అన్నం పెట్టేది రైతన్నే. అందరి కన్నా వెనుబడింది ఆయనే. పంట సరిగ్గా పండితే గిట్టుబాటు ధర ఉండదు. వరుడు కరుణించకపోతే ఆ మాత్రం పంట కూడా ఉండదు. ఈ సారి పంటపై వచ్చే డబ్బులతో కష్టాలన్నీ తీరపోతాయని ఆశపడ్డా.. నాయకుల పనితనమో లేక దళారుల మోసమో.. ఆ కష్టాల్లోనే ఉండిపోతాడు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన రైతు రాజీవ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎస్‌డీఎం డాక్టర్ దీక్షా జోషి కాళ్ల మీద పడి ఏడ్చాడు. రైతు తన భూమిని విభజించేందుకు క్లర్క్ 10వేల లంచం అడుగుతున్నాడని.. నెలల తరబడి న్యాయం కోసం వేడుకుంటున్నా పని జరగట్లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఇక తన తర్వాతి చిరునామా శ్మశానం అవుతుందని.. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని దుఖించాడు. ఇదంతా ఓపిగ్గా విన్న ఆఫీసర్.. భూమి విభజన త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. సదరు అధికారిపై విచారణకు ఆదేశించింది.






