నడిరోడ్డుపైనే మొదలెట్టారు... అందరూ చూస్తుండగానే రొమాన్స్!

by velandi.Saikiran |

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ

నడిరోడ్డుపైనే మొదలెట్టారు... అందరూ చూస్తుండగానే రొమాన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే... మరికొన్ని కాస్త భయానకంగా ఉంటాయి. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.... ఇద్దరు లవర్స్... చేసిన ఓ పాడుకొని ఇప్పుడు వైరల్ గా మారింది.

నడిరోడ్డుపై.. రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు పట్టణంలోని ఓ ఫ్లై ఓవర్ పై ఇద్దరు లవర్స్ రచ్చ చేశారు. సరదాగా... ఆ ఫ్లై ఓవర్ రోడ్డుపైనే గడిపారు. కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం... ఇలా నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం కూడా చేశారు.

అయితే ఈ వీడియోను... ఎవరో గుర్తు తెలియని వ్యక్తి క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతకు తెగించార్రా.. నడిరోడ్డు పైన మొదలు పెట్టారా? అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లను ఏదో ఒక కారు లేదా బస్సు గుద్దితే.. అయిపోవ్ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Instagramme Link

Next Story