ప్రియురాలి ఇంట్లో పట్టుబడిన ప్రియుడు.. వారెవ్వా ‘అర్ధరాత్రి మద్దెల దరువు’!

by Kema Shiva Kumar |

జార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ విచిత్రమైన ఘట్టం చోటుచేసుకుంది.

ప్రియురాలి ఇంట్లో పట్టుబడిన ప్రియుడు.. వారెవ్వా ‘అర్ధరాత్రి మద్దెల దరువు’!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో మనం చిత్రవిచిత్ర ప్రేమ కథలను చూస్తున్నాం. ట్విస్ట్‌లు, ఛేజింగ్‌లు, ఫైట్లు షరా మామూలే. కానీ, జార్ఖండ్‌ (Jharkhand)లో జరిగిన ఓ రియల్ లవ్ స్టోరీ రోటీన్‌కు భిన్నంగా ఉందండోయ్. వివరాల్లోకి వెళితే.. గర్వా (Garva) జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సదరు యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పటికే అక్కడ మాటువేసిన యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు యువకుడి కదలికలకు అలర్ట్ అయ్యి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రాత్రికి రాత్రే పెళ్లి పీటలెక్కించి..

ప్రేమికులిద్దరూ పట్టుబడటంతో గ్రామంలో జోరుగా చర్చ నడిచింది. అనంతరం ఉదయం వరకు ఆగకుండా అర్థరాత్రే గ్రామ పెద్దలు వెంటనే అత్యవసరంగా పంచాయితీ పెట్టేశారు. ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి మాట్లాడారు. ప్రేమికులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నామని, పెళ్లికి సిద్ధమేనని చెప్పడంతో గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పోలీస్ కేసులు, గొడవలు లేకుండా వారిద్దరికీ వివాహం జరిపించాలని తీర్మానించారు. అనుకున్నదే తడవుగా సోమవారం తెల్లవారుజామున స్థానిక ఆలయంలో హిందూ సాంప్రదాయం (Hindu Tradition) ప్రకారం, గ్రామస్థుల సమక్షంలో ఆ జంటకు ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సాంప్రదాయబద్ధంగా పూలదండలు మార్చుకుని ఏడడుగులు నడిచేశారు.

నయా జంట సోషల్ మీడియాలో వైరల్..

వివాహం అనంతరం వధువు తన భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్తున్న దృశ్యాలను స్థానికులు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన ‘మిడ్‌నైట్ మ్యారేజ్’ వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించి, ప్రేమికులను ఒకటి చేసిన గ్రామస్థుల నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Next Story