- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటలు లేనిప్రేమ.. ప్రాణాలు కాపాడిన వారికి ఏనుగు థ్యాంక్స్ ఎలా చెప్పిందంటే?
జంతువులకు, మనుషులకు మధ్య వీడదీయలేని అనుబంధం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: జంతువులకు, మనుషులకు మధ్య వీడదీయలేని అనుబంధం ఉంటుంది. వాటికి చిన్నసాయం చేసిన మనపై ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటాయి. మనుషులపై అవి కురిపించే ప్రేమకు సంబంధించిన దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో (Social media) చూస్తూనే ఉంటాం. తాజాగా చత్తీస్‌గఢ్‌లో ( Chhattisgarh) ఇలాంటి ఓ గుండెలకు హత్తకునే సంఘటన చోటుచేసుకుంది. తన ప్రాణాలను కాపాడిన వారి చిన్న ఏనుగు (Elephant) థ్యాంక్స్ చెప్పే విధానం చూసి నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?
రాయగఢ్ జిల్లా చిల్కగూడా గ్రామం సమీపంలో లైలుంగా, ఘఘోఢా అడవి పరిధిలో తిరుగుతున్న పెద్ద ఏనుగు గుంపు నీరు తాగేందుకు మట్టిగుంత వద్దకు వచ్చారు. ఇందులోని ఓ చిన్న ఏనుగు ప్రమాదవశాత్తు ఆ మట్టిగుంతలో చిక్కుకుపోయింది. బయటకి వచ్చేందుకు ఎంతో కష్టపడింది కానీ రావలేకపోయింది. దాని ఏడుపులు అడవి అంతటా వినిపించాయి. దీన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు, గ్రామస్తులతో కలిసి JCB యంత్రాలను రంగంలోకి దించారు. జాగ్రత్తగా మట్టిని తొలగిస్తూ ఏనుగుకు బయటకు వచ్చే మార్గాన్ని సృష్టించారు. దాదాపు 50 గంటల పాటు అహర్నిశలూ శ్రమించి చివరకు చిన్న ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు.
బయటకు వచ్చిన వెంటనే ఆ చిన్న ఏనుగు సరిగ్గా తనను రక్షించిన JCB యంత్రం వద్దకు వచ్చి, ప్రేమగా తాకింది. అది తన భాషలో థ్యాంక్యూ చెప్పినట్టుగా కనిపించింది. ఆపై ఉత్సాహంగా అడవిలోకి తిరిగి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.






