లవ్ స్వాప్.. భార్య చెల్లితో భర్త.. బావ సోదరితో బామ్మర్ది జంప్

by Naga Rani Yarlagadda |

మానవ సంబంధాలు రోజురోజుకూ అధ్వాన్నంగా తయారవుతున్నాయి. పెళ్లై పిల్లలున్నా కూడా.. అక్రమ సంబంధం మోజులో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో లవ్ స్వాప్ ఘటన వెలుగుచూసింది.

లవ్ స్వాప్.. భార్య చెల్లితో భర్త.. బావ సోదరితో బామ్మర్ది జంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛీఛీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మానవ సంబంధాలు రోజురోజుకూ అధ్వాన్నంగా తయారవుతున్నాయి. పెళ్లై పిల్లలున్నా కూడా.. అక్రమ సంబంధాల మోజులో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో లవ్ స్వాప్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య చెల్లెలితో పరారవ్వగా.. అతని సోదరితో బామర్ది జంపయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బరేలి జిల్లాలోని కమలుపూర్ గ్రామానికి చెందిన కేశవ కుమార్ (28) కు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆగస్టు 23వ తేదీన కేశవకుమార్ భార్య చెల్లెలు కల్పనతో ఇంటి నుంచి పారిపోయాడు. ఆ మర్నాడే.. ఆమె సోదరుడైన రవీందర్ (22) కేశవ కుమార్ సోదరి (19)తో పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. గ్రామస్తులు షాకయ్యారు.

ఇరు కుటుంబాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి.. సెప్టెంబర్ 15వ తేదీన నలుగురినీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నలుగురికీ కౌన్సెలింగ్ ఇవ్వగా.. తాము చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. కేశవ కుమార్ కల్పనను, రవీందర్.. కేశవ సోదరిని వదిలిపెట్టేందుకు అంగీకరించారు. దీంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ.. గ్రామంలో మాత్రం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు అలా ఎలా లేచిపోయారంటూ అమ్మలక్కలు ఇంకా గుసగుసలాడుకుంటున్నారు.

Next Story