వామ్మో.. తోపుడు బండిపై ‘లూజ్ మ్యాగీ’ కూరగాయల మాదిరి బలే గిరాకీ!

by Disha Web Desk 14 |
వామ్మో.. తోపుడు బండిపై ‘లూజ్ మ్యాగీ’  కూరగాయల మాదిరి బలే గిరాకీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్కెట్‌, గల్లీలల్లో కూరగాయలు, నిత్యవసర సరుకులు, లేదా ఇతర సామాగ్రి తోపుడు బండ్లపై పెట్టి వ్యాపారస్తులు నిత్యం అమ్మడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అందుకు భిన్నంగా ఇంకో ఊహించని ఐటమ్ కూడా ఒకటి తోపుడు బండిపై పెట్టి అమ్ముతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో ఇష్టపడే లూజ్ మ్యాగీని వ్యాపారి తొపుడు బండిపై పెట్టి అమ్ముతున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. సూపర్ మార్కెట్, షాపుల్లో దొరికే మ్యాగీ ఇప్పుడు కూరగాయల మాదిరిగా తోపుడు బండిపై పెట్టి అమ్ముతున్నారు. ఆ ‘లూజ్ మ్యాగీ’ని వ్యాపారస్తుడు రోడ్డుపై తిరుగుతూ అమ్ముతున్నాడు.

ఆ లూజ్ మ్యాగీని కిలోల లెక్కన తూకం వేసి.. దాని క్వాంటిటీ బట్టి మసాలా ప్యాకెట్లు ఇస్తున్నాడు ఓ వ్యాపారి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లో ఎదైనా సాధ్యమేనని నెటిజన్లు అంటున్నారు. మరి ఎక్స్‌పైరీ డేట్ ఏ విధంగా ఉంటుందనేది నెటిజన్లకు సందేహంగా మారింది. ఈ లూజ్ మ్యాగీ నూడిల్స్ కచ్చితంగా ఎక్స్‌‌‌‌పైరి అయిపోయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ మ్యాగీ కొంటే ఫ్రీ దుమ్ము ఫ్లేవర్ వస్తదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆ లూజ్ మ్యాగీ విక్రయిస్తున్న వ్యక్తి వద్ద గిరాకీ కూడా బాగానే ఉన్నట్లు వీడియోలో కన్పిస్తుంది.

Next Story