- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్.. ఈ పాపకు ఏం పేరు పెట్టారో చూడండి!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌కి వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ విషాద ఘటనలో కళ్ల ముందే కట్టుకున్న వారిని కడతేర్చి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆడబిడ్డల నుదుట బొట్టును తుడిచేసిన ఉగ్రమూకలపై భారత్(India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో రంగంలోకి దిగింది.
ఇదిలా ఉంటే.. తాజాగా బిహార్(Bihar)లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఓ వ్యక్తి తన కూతురికి ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో సైనిక చర్యకు పాల్పడిన రోజున తమకు పాప జన్మించిందన్నారు. అందుకే తమ పాపకు సిందూర్ అనే పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. పాపకు ఈ పేరు పెట్టేందుకు వైద్య సిబ్బంది ఆమోదించారని తెలిపారు. అయితే.. పాపకు సిందూర్ అంటే అర్థం ఇప్పుడే తెలియక పోయిన.. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.






