- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏనుగా మజాకా.. నదిలో చిక్కుకున్న కారును ఎలా లాగిందో చూడండి!
కొన్ని సందర్భాల్లో, అనుకోకుండా ప్రమాదవశాత్తు కార్లు, బైకులు నదుల్లో లేదా చెరువుల్లో చిక్కుకుపోవడం మనం తరచుగా చూస్తుంటాం.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సందర్భాల్లో, అనుకోకుండా ప్రమాదవశాత్తు కార్లు, బైకులు నదుల్లో (River) లేదా చెరువుల్లో చిక్కుకుపోవడం మనం తరచుగా చూస్తుంటాం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలను (Vehicles) బయటకు తీసేందుకు ప్రత్యేక టోయింగ్ వాహనాలు లేదా రెస్క్యూ బృందాల సాయం తీసుకుంటారు. కానీ, కేరళలో (Kerala) ఇటీవల జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. ఇక్కడ కారును బయటికి తీసింది ఓ గజరాజు (Elephant). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. మరీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా.
కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా తిరువేగప్పుర గ్రామంలోని నదిలో ఇటీవల ఓ తెల్లటి టయోటా ఫార్య్చూనర్ కారు (Toyota Fortuner car) కొంత భాగం మునిగిపోయింది. దానికి బయటికి తీసుకువచ్చేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో 'తిరువేగప్పుర శంకరనారాయణన్' అనే ఏనుగు సాయంతో ఈ కారును బయటకి సులువుగా తీసుకొచ్చారు. దాదాపు రెండున్నర టన్నులకు పైగా బరువున్న ఆ భారీ వాహనాన్ని ఆ ఏనుగు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా నీటిలోంచి బయటకు లాగింది. తొలుత కారు ముందు భాగంలో తాడు కట్టగా, దాని తొండంతో తాడును పట్టుకొని లాగేందుకు ప్రయత్నించింది. కానీ, తాడు నేలపై పడిపోతూనే ఉంది, దీంతో తెలివిగా ఆలోచించిన ఆ గజరాజు తాడును తీసుకొని గట్టిగా పట్టుకోవడానికి దాని నోటిలో పెట్టుకుని క్షణాల్లో బయటకు కారును తీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఏనుగు శక్తి, సహనం చూసిన నెటిజన్లు ఏనుగా మజాకా, బాహుబలి గజరాజ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ ఘటన కేవలం ఏనుగు శక్తిని మాత్రమే కాకుండా, మనుషులు, జంతువుల మధ్య ఉన్న అనుబంధాన్ని, సహకారాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.






