- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న లోకో పైలట్.. రైలు ఆపి మూగ జీవాలను కాపాడి..
రైల్వే ట్రాక్‌పై అడ్డుగా ఉన్న గేదెను చూసి లోకో పైలట్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ట్రాక్ (Railway Track)లు క్రాస్ చేస్తూ నిత్యం వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. లోకో పైలట్ (Loco Pilot)లు గమనించక.. ఒకవేళ ట్రాక్‌పై జీవాలను చూసి హుటాహుటిన ట్రైన్ ఆపే పరిస్థితి లేక అనర్థాలు జరిగిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు జరిగే అద్భుతాలు మాత్రం మనసు హత్తుకుంటాయి. తాజాగా అలాంటి హృదయాన్ని తట్టేలేపే దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ పశువు ప్రాణాన్ని కాపాడేందుకు లోకో పైలట్ చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా రైలు పట్టాలపై ఏదైనా పశువు అడ్డు వస్తే.. హారన్ కొట్టడం, సాధ్యమైనంత వరకు వేగాన్ని తగ్గించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ లోకో పైలట్ ఒక అడుగు ముందుకు వేశారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ట్రాక్‌పై ఒక గేదె మొండిగా నిలబడి ఉండటాన్ని పైలట్ గమనించారు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా ఆ పశువు అక్కడ నుంచి కదలలేదు. గేదె కదలడం లేదని గ్రహించిన లోకో పైలట్, తక్షణమే రైలుకు బ్రేకులు వేసి పట్టాలపైనే నిలిపివేశారు. అంతటితో ఆగకుండా, క్యాబిన్ లోంచి కిందకు దిగి స్వయంగా ఆ గేదె వద్దకు వెళ్లారు. ఎంతో ఓపికగా దాన్ని పట్టాల నుంచి పక్కకు పంపించారు. ఆ గేదె సురక్షితంగా దూరంగా వెళ్లినట్లుగా నిర్ధారించుకున్న తర్వాతే ఆయన మళ్లీ రైలు ఎక్కి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే, ఆ దృశ్యాలను ఎవరో మొబైల్‌లో బంధించి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ‘నిజమైన హీరో అంటే ఇతనే’, ‘వృత్తి ధర్మంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లతో పొగిడేస్తున్నారు.






