Viral video: చెట్టు నుంచి నీళ్లు.. ‘పవిత్ర జలం’ అనుకోని స్థానికుల పూజలు.. చివరికి ఏమైందంటే?

by Ramesh Naini |   (  Updated:2025-06-09 12:11:35  IST  )

ఓ చెట్టు తొర్రలో నుంచి నీళ్లు రావడంతో దేవుని మాయ అనుకొని స్థానికులు పూజలు చేసిన ఘటన తాజాగా వైరల్ అవుతోంది.

Viral video: చెట్టు నుంచి నీళ్లు.. ‘పవిత్ర జలం’ అనుకోని స్థానికుల పూజలు.. చివరికి ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video) ఓ చెట్టు తొర్రలో నుంచి నీళ్లు రావడంతో దేవుని మాయ అనుకొని స్థానికులు పూజలు చేసిన ఘటన తాజాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. (Maharashtra) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పింప్రీ-చించ్వాడ్ నగరంలో గత శుక్రవారం ఒక చెట్టు నుంచి ఉన్నట్టుండి నీళ్లు (Water tree) రావడం ప్రారంభించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో స్థానికులు దేవుని మాయ అనుకోని పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ నీటిలో మహిమలు ఉండొచ్చనే నమ్మకంతో చెట్టు నుంచి వస్తున్న నీళ్ల కోసం జనం బారులు తీరి మరి పూజలు నిర్వహించారు. కొంతమంది (Holy water) ‘పవిత్ర జలం’ అంటూ నీటిని తాగడం, నెత్తిన జల్లు కోవడం, బాటిల్స్‌లో నీటిని సేకరించడం చేశారు. కొందరు చెట్టు ఏడుస్తోందని, మరికొందరు మహిమగల చెట్టని ప్రజలు చెట్టుకు పూల మాలలు వేసి, పసుపు పూసి పూజలు చేశారు. అయితే అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని హేతుబద్దమైన మనస్తత్వం కలిగిన కొందరికి అనుమానం రావడంతో అధికారులను ఆశ్రయించారు.

పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించి, చెట్టు కింద ఉన్న పాత పైప్ లైన్ పగిలిందని నిర్ధారించారు. దీంతో దానిపై పెరిగిన చెట్టు కాండం గుండా నీరు బయటకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో పూజలు చేసిన వారంతా అవాక్కయ్యారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారత్‌లో కొంత మంది ప్రజలు ఇంకా కూడా మూఢ నమ్మకాలను నమ్ముతున్నారని ఈ ఘటన అందుకు ఓ మంచి ఉదాహరణ అని ఓ యూజర్ ఆసక్తికర కామెంట్ పెట్టారు.

కాగా, గతంలో ఉత్తరప్రదేశ్‌లోని (Brindavan) బృందావన్‌లో ప్రముఖ ప్రసిద్ధ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయంలో.. గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని పవిత్ర జలం అనుకోని భక్తులు ఎగబడి మరి తాగారు. అయితే అది శ్రీ కృష్ణుని చరణామృతం నీళ్లు కాదని, ఏసీ నీళ్లు అని తెలియడంతో భక్తులు షాక్ అయ్యారు. కొంత మంది ప్రజలు ఎంత అంధ విశ్వాసంతో ఉన్నారో.. గతంలో జరిగిన ఏసీ వాటర్ ఘటనను తాజాగా జరిగిన చెట్టు నీళ్లు సంఘటనతో ఓ నెటిజన్ పోల్చారు.

Next Story