లోకల్ ట్రైన్‌లో జుట్టు పట్టి కొట్టుకున్న మహిళలు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-02 09:11:19  IST  )

ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళలు గొడవ పడుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎస్టి-కళ్యాణ్ లోకల్ ట్రైన్‌లో డోంబివ్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. కిక్కిరిసిన రైలులో

లోకల్ ట్రైన్‌లో జుట్టు పట్టి కొట్టుకున్న మహిళలు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళలు గొడవ పడుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎస్టి-కళ్యాణ్ లోకల్ ట్రైన్‌లో డోంబివ్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. కిక్కిరిసిన రైలులో మహిళా ప్రయాణికులు తమలో తాము ఘర్షణకు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ వైరల్ అయింది. వైరల్ వీడియోలో ఒక మహిళ మరొక మహిళ జుట్టును గట్టిగా పట్టుకుని ఉండగా.. మిగిలిన మహిళలు వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనను చూసిన కొంతమంది ప్రయాణికులు జిఆర్పి కంట్రోల్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారని జిఆర్పి వర్గాలు తెలిపాయి. రైలు కుర్లా చేరుకున్నప్పుడు.. పరిస్థితిని పరిష్కరించడానికి కుర్లా ఆర్పిఎఫ్ బృందం అక్కడికి చేరుకున్నాయి. కానీ అప్పటికే.. గొడవ పడిన మహిళలు దిగిపోయారు.

అయితే రైల్వే పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తమకు ఏ మహిళ నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఇక ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు.. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందని, వీళ్ల కన్నా జంతువులు నయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇదేమైనా లోకల్ ట్రైన్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి పరిస్థితులు మారాలంటే రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story