Viral video: జిరాఫీని చుట్టూ ముట్టిన సింహాలు.. చివరికి ఏం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |

అడవి మృగాలైన సింహాలు, పులుల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Viral video: జిరాఫీని చుట్టూ ముట్టిన సింహాలు.. చివరికి ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అడవి మృగాలైన సింహాలు (Lion), పులుల (Tiger) దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఆకలితో ఉంటే ఎలాంటి జంతువునైనా తమ పంజాతో ఇట్టే మట్టికరిపించగలవు. ఈ క్రమంలో కొన్నిసార్లు కిలోమీటర్ల మేర పరిగెత్తి పరిగెత్తి వేటాడితే.. మరికొన్నిసార్లు క్షణాల్లో విజయం సాధిస్తాయి. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవ్వటం చూస్తుంటాం. తాజాగా కూడా నెట్టింట సింహాల వేటకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ జిరాఫీని సింహాల గుంపు చుట్టూ ముట్టగా.. ఏమైందో మీరే చూడండి.

వైరల్ అవుతున్నా వీడియోలో.. ఓ దారిలో వెళ్తున్న జిరాఫీని నాలుగైదు సింహాలు చుట్టూ ముట్టాయి. జిరాఫీకి పరిగెత్తే అవకాశం లేకుండా సింహాలన్నీ దాన్ని కాళ్లను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కనిపిస్తున్నాయి. వాటి నుంచి విడిపించుకోడానికి జిరాఫీ ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి ఆ జిరాఫీ తట్టుకోలేక నెలకొరిగిపోయింది. ఈ సన్నివేశాలను అక్కడికి సపారీకి వెళ్లిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోరాడి ఓడిన జిరాఫీ.. పాపం అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story