సఫారీకి వెళ్లిన బాలుడిపై చిరుత దాడి..షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

కుటుంబ సభ్యులతో కలిసి సఫారీకి వెళ్లిన బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన బెంగుళూరులోని బన్నెర్ ఘట్టా బయోలాజికల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.

సఫారీకి వెళ్లిన బాలుడిపై చిరుత దాడి..షాకింగ్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులతో కలిసి సఫారీకి వెళ్లిన బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన బెంగుళూరులోని బన్నెర్ ఘట్టా బయోలాజికల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సఫాజీ జీపులో బాలుడు వెళుతుండగా రోడ్డు పక్కన చిరుతపులి కనిపించడంతో జీపులోనే కూర్చుకుని ఫోటోలు తీశారు. కాసేపు జీపు ఆపగా వెంటనే వచ్చిన చిరుతపులి దూకి విండోలో నుండి బాలుడిపై దాడి చేసింది.

దీంతో వెంటనే డ్రైవర్ జీపును స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. చిరుతపులి పక్కకి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో బాలుడికి స్పల్పగాయాలు అయినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్టు తెలుస్తోంది. చిరుతపులి జీపుపై ఎటాక్ చేసిన సన్నివేశాన్ని వెనకాల ఉన్న ఓ టూరిస్ట్ ఫోన్ లో రికార్డ్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో సఫారీకి వెళ్లిన సమయంలో టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. video

Next Story