రూ. 14 కోట్లు నొక్కేసిన లేడీ బాబా

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర పూణేలోని ఐటీ ఇంజనీర్ దంపతులు ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. జీవితంలో సంపాదించిన ఆస్తిని బాబాల మాయలో పడి చేజేతుల నీటి పాలు చేసుకున్నారు. ఇంజనీర్ దీపక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ వారికి పుట్టినప్పటి నుంచే సరైన ఎదుగుదల లేదు

రూ. 14 కోట్లు నొక్కేసిన లేడీ బాబా
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణేలోని ఐటీ ఇంజనీర్ దంపతులు ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. జీవితంలో సంపాదించిన ఆస్తిని బాబాల మాయలో పడి చేజేతుల నీటి పాలు చేసుకున్నారు. ఇంజనీర్ దీపక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ వారికి పుట్టినప్పటి నుంచే సరైన ఎదుగుదల లేదు. ఇప్పటికే వైద్యపరంగా చాలా ఖర్చు చేశారు. కానీ సరైన ప్రయోజనం లేకపోవడంతో దైవిక మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రముఖ సన్యాసినిగా చెప్పకుంటూ తిరుగుతున్న వేదికా పంధర్పుర్కర్.. 19వ శతాబ్దానికి చెందిన సాధువు శంకర్ మహారాజ్ ఆత్మను కలిగి ఉన్నానని, పిల్లలను కచ్చితంగా బాగు చేస్తానని హామీ ఇచ్చింది. ఇందుకు తన సహాయకులు బాబా రాజేంద్ర ఖడ్కే, కునాల్ పంధర్పుర్కర్ తోడయ్యారు.

ముందుగా ఖడ్కే కుటుంబాన్ని కలిశాడు. పిల్లల వ్యాధుల గురించి తెలుసుకుని వేదికతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె సమాధిలోకి ప్రవేశించి శంకర్ మహారాజ్‌తో మాట్లాడుతున్నానని ప్రకటించింది. పిల్లల వ్యాధులకు అద్భుతమైన ఉపశమనం కలుగుతుందని హామీ ఇచ్చింది. మొత్తానికి ఆ కుటుంబీకుల నమ్మకాన్ని చూరగొది. మొదట డబ్బు ట్రాన్స్‌ఫర్లు, తర్వాత బంగారు ఆభరణాలు.. ఆ తర్వాత యూకేలోని ఇల్లు, ఫామ్ హౌజ్. చివరగా పూణే నివాం.. మొత్తం వేదిక పేరు మీదకు వెళ్లిపోయాయి. ఈ డబ్బులతో వేదిక పుణేలోని రిచెస్ట్ ఏరియా కోథ్రుడ్‌లో లగ్జరీ బంగ్లా కొనుగోలు చేసింది.

నెలలు గడుస్తున్నా కూతుర్ల ఆరోగ్యం బాగుపడకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుణే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్‌కు ఫార్మల్ ఫిర్యాదు అందించాడు. తన ఆస్తులను తనకు అప్పగించాలని, న్యాయం చేయాలని కోరాడు.

Next Story