- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KU క్యాంపస్‌లో పోలీసులు అత్యుత్యాహం.. విద్యార్థులను తంతూ ఈడ్చుకెళ్లిన వైనం (వీడియో)
కాకతీయ యూనివర్సిటిలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ యూనివర్సిటిలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏబీవీపీ నిర్వహించాలని తలపెట్టిన సెమినార్ కి అనుమతి నిరాకరించడం వల్ల రిజిస్టర్ ఆఫీస్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అక్కడే ధర్నా నిర్వహించారు. దీంతో సమాచారం అందుకున్న KU పోలీసులు భారీగా మోహరించి విద్యార్థులను, విద్యార్థి నాయకులను చాంబర్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు.
ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడమే కాకుండా.. ఓ విద్యార్థిని కాలితో తన్నడం, గొంతు పట్టుకోవడం చేశారు. దీన్ని అడ్డుకోబోయిన ABVP నాయకుడిని పోలీసులు తోసేసారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న వారు తమ సెల్ ఫోన్‌లలో రికార్డు చేయగా.. కేయూ పోలీసుల తీరును నిరసిస్తూ.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Next Story






