వైరల్ గా మారిన కేటీఆర్ లోడింగ్ 3.0 రప్పా రప్పా కటౌట్లు

by Muthe.Rajitha |

ఇటీవల రెండు రాష్ట్రాల్లో వివాదాస్పదం అయిన 'రప్పా రప్పా' డైలాగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

వైరల్ గా మారిన కేటీఆర్ లోడింగ్ 3.0 రప్పా రప్పా కటౌట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రెండు రాష్ట్రాల్లో వివాదాస్పదం అయిన 'రప్పా రప్పా' డైలాగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'శేరిలింగంపల్లి లోడింగ్ 3.0 రప్పా రప్పా' అంటూ కేటీఆర్ పేరుతో వెలిసిన కటౌట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేడు హైదరాబాద్ లోని శేరి లింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో "రప్పా రప్పా" డైలాగ్‌తో కూడిన పోస్టర్లు మరియు కటౌట్‌లు వెలిసాయి. 'రప్పా రప్పా' డైలాగ్, 'లోడింగ్ 3.0' అనే ట్యాగ్‌లైన్‌తో పెట్టిన ఈ కటౌట్ పార్టీ శ్రేణులను విపరీతంగా ఆకర్షించింది. కాగా

నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫేమస్ అయిన రప్పా రప్పా డైలాగ్ తో కూడిన కటౌట్లు మొదట ఏపీ మాజీ సీఎం జగన్ సభలో ప్రదర్శించగా.. ఆ అంశం కాస్త వివాస్పదంగా మారింది. అనంతరం తెలంగాణలోనూ ఇదివరకు కేటీఆర్, హరీష్ రావు సభల్లో అలాంటి డైలాగులతో కూడిన కటౌట్లు ప్రదర్శించడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story