- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishtwar Floods: కిష్టవర్ వరదలు.. ఎటు చూసినా మృతదేహాలే
జమ్మూ కశ్మీర్లోని కిష్టవర్(Kishtawar Floods) లో నిన్న క్లౌడ్ బరస్ట్(Cloud Burst) జరిగి ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్లోని కిష్టవర్(Kishtawar Floods) లో నిన్న క్లౌడ్ బరస్ట్(Cloud Burst) జరిగి ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఎటు చూసిన హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పసిపిల్లల మృతదేహాలను ఎత్తుకుని వస్తున్న విజువల్స్ గుండెల్ని పిండేసేలా ఉన్నాయని భావోద్వేగానికి గురవుతున్నారు. రెండు రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న బాధితులు, ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరుకుంది. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్మీ, నేవి, NDRF, SDRF లతో సహా 300 మంది సైనిక బృందాల రెస్క్యూ ఆపరేషన్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. అయితే వరదల సమయంలో దాదాపు 1200 మంది ఆ ప్రాంతంలో ఉండవచ్చని, శిథిలాల కింద ఇంకా 500 మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మంది గుర్తించారు. ఈ ప్రాంతం అంతా బురద, పెద్ద రాళ్లతో నిండిపోయి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నట్టు సమాచారం. రెస్క్యూ చేసిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి. వైద్యం, ఆహారం అందిస్తున్నారు.






