వాట్సాప్ మెసేజ్ చూసి దొంగలించిన బంగారం తిరిగిచ్చేసిన దొంగ.. అందులో ఏం ఉందంటే?

by Ajay Maddhiboyina |

దొంగతనం చేసిన ఓ దొంగ తనకు మంచి జరగటంలేదని చోరీ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వాట్సాప్ మెసేజ్ చూసి దొంగలించిన బంగారం తిరిగిచ్చేసిన దొంగ.. అందులో ఏం ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దొంగతనం చేసిన ఓ దొంగ తనకు మంచి జరగటంలేదని చోరీ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళలోని పోయినచిలోని పరంబా లక్ష్మి నివాస్‌లో ఉండే గీత అనే మహిళ తన భర్తతో కలిసి బస్ లో వెళుతున్న సమయంలో ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును కొట్టేశాడు. బస్సు దిగిన తరవాత చూసిన దంపతులు ఆందోళన చెందారు. తిరిగి వెళ్లి వెతికినా లాభం లేకుండా పోయింది. తన పెళ్లి బంగారం పోయింది అంటూ వాట్సాప్ లో గీత పోస్ట్ చేయగా దానిని చాలా మంది ఫార్వర్డ్ చేశారు.

అలా చివరికి దొంగ దగ్గరకు మెసేజ్ చేరుకుంది. ఆ మెసేజ్ చూసిన దొంగ ఆ గొలుసు చోరీ చేసినప్పటి నుండి తనకు కూడా మంచి జరగటం లేదని భావించి తిరిగి ఇచ్చేశాడు. వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసి వారి ఇంటి ముందు ఓ లెటర్ రాసి అందులో గొలుసు పెట్టి వెళ్లిపోయాడు. లెటర్ లో... ఈ గొలుసు నా దగ్గరకు వచ్చి 9 రోజులు అవుతోంది. మొదట నాకు సంతోషంగా అనిపించినా తరవాత నాకు గొలుసును పట్టుకున్నప్పుడల్లా చెడు జరుగుతోంది. ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా వాట్సాప్ లో మీ మెసేజ్ కనిపించింది. అప్పుడే అవి పెళ్లి నగలు అని తెలిసింది. మీ న‌గ‌లు దొంగ‌లించి బాధ‌పెట్టినందుకు క్ష‌మించండి.. అంటూ రాసి ఉంది. ఏదేమైనా మొత్తానికి పోయిన బంగారం తిరిగొచ్చింద‌ని బాధితురాలు సంతోషం వ్య‌క్తం చేసింది.

Next Story