కూతురి పెళ్లి.. భార్యతో కలిసి స్టెప్పులేసిన కేజ్రీవాల్.. ఏ పాటకో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-19 11:54:01  IST  )

కూతురి పెళ్లి.. భార్యతో కలిసి స్టెప్పులేసిన కేజ్రీవాల్.. ఏ పాటకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్‌ జైన్‌తో శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపుర్తలా హోస్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూతురి పెళ్లిలో కేజ్రీవాల్‌ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వేడుకల్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి స్టెప్పులు వేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప-2' చిత్రంలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌కు డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్‌ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సైతం అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

కాగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్‌ జైన్‌ ప్రేమించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి బసిల్‌ హెల్త్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇక ఏప్రిల్‌ 20వ తేదీన రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు

Click For Tweet Post..

Next Story