- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hubballi Encounter : కర్ణాటక ఎన్కౌంటర్... లేడీ సింగం అంటున్న కన్నడ ప్రజలు
కర్ణాటక(Karnataka)లో ఓ ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో నిందితున్ని పోలీసులు ఆదివారం ఎన్కౌంటర్(Hubballi Encounter) చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో ఓ ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో నిందితున్ని పోలీసులు ఆదివారం ఎన్కౌంటర్(Hubballi Encounter) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నిందితుణ్ణి పట్టుకోడానికి ప్రయత్నించింది మాత్రం పీఎస్ఐ అన్నపూర్ణ(PSI Annapurna). కాగా చిన్నారి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బృందం ఆసుపత్రికి చేరుకోగా.. అక్కడ విగతజీవిగా పడి ఉన్న పాపను చూసి పోలీసులు సైతం కన్నీళ్ళు ఆపుకోలేకపోయారు. ఎలాగైనా నిందితుణ్ణి పట్టుకొని తగిన శిక్ష పడేలా చేయాలని.. అణువణువు గాలించారు. చివరికి నిందితుణ్ణి అదుపులోకి తీసుకోగా.. అతడు పారిపోయేందుకు పోలీసులపై దాడికి దిగాడు. తొలుత లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ.. నిందితుడు పారిపోయే ప్రయత్నమే చేయగా.. అన్నవూర్ణ అతడిపై రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. అతడు అక్కడికక్కడే హత్యమయ్యాడు. ప్రస్తుతం కన్నడ నాట అన్నపూర్ణను లేడీ సివంగి అని కొనియాడుతున్నారు.
అయితే కర్ణాటకలోని హుబ్బళ్ళిలో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిని స్థానికంగా కూలీ పనులు చేసుకునే పాట్నాకు చెందిన రితేష్ కుమార్ కిడ్నాప్ చేశాడు. పాప కనిపించక పోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా.. అక్కడే ఉన్న ఓ పాడుబడిన భవనంలోని బాత్రూమ్ లో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చిన్నారి చనిపోయినట్టు ప్రకటించారు. పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుణ్ణి పట్టుకొని విచారణకు తరలిస్తుండగా.. పోలీసులపై తీవ్ర దాడికి దిగాడు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. నిందితుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.






