- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.9.34 లోన్ చెల్లించాలంటూ రైతుకు నోటీసులు..కట్ చేస్తే !
రూ.9.34 రుణం తిరిగి చెల్లించాలని ఓ రైతును కర్ణాటక కెనరా బ్యాంక్ అడుగుతోంది.

In Karnataka, a farmer cleared his ₹50,000 loan
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని న్యూస్ విత్తగా కనిపిస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం రూ.9.34 కట్టాలని ఓ అమాయక రైతుకు బ్యాంకు నోటీసులు పంపింది. నోటీసులకు రియాక్ట్ కాకపోవడంతో మెసేజ్ ల మీద మెసేజ్లు పంపిస్తూ చుక్కలు చూపిచింది కెనరా బ్యాంక్ ( Canara Bank ). ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.9.34 లోన్ చెల్లించాలంటూ రైతుకు నోటీసులు
కర్ణాటకలోని చొక్కన్న గౌడ అనే రైతు కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. క్రాప్ లోన్ లో భాగంగా 50 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు చొక్కన్న గౌడ అనే రైతు. అయితే తీసుకున్న ఈ లోన్ కొన్ని నెలల తర్వాత మొత్తం ఇటీవల క్లియర్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ రూ.9.34 బ్యాంకుకు బాకీ పడ్డాడు రైతు చొక్కన్న గౌడ. అయితే ఆ తొమ్మిది రూపాయలను కూడా వసూలు చేసేందుకు కెనరా బ్యాంక్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రైతుకు నోటీసులు కూడా పంపింది కెనరా బ్యాంక్. బాకీ పడ్డ తొమ్మిది రూపాయల 34 పైసలు కట్టాల్సిందేనని ఫోన్ కు మెసేజ్లు కూడా పంపింది.
బాధిత రైతు అదిరిపోయే కౌంటర్
అయితే ఈ విషయంలో చాలా సీరియస్ అయిన సదరు రైతు, బ్యాంకుకు వెళ్లి పది రూపాయలు కట్టేశాడు. ఆ తర్వాత సైలెంట్ గా ఉండకుండా.. మిగిలిన 66 పైసలు వెనక్కి ఇచ్చేయండి అంటూ మొండి పట్టుపట్టాడు రైతు చొక్కన్న గౌడ. 66 పైసలు ఇచ్చే వరకు బ్యాంకు నుంచి బయటకు వెళ్లబోనని నిరసన కూడా తెలిపాడు. ఇక రైతు నిరసన తెలిపిన నేపథ్యంలో కెనరా బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. ఇదెక్కడి తలనొప్పి రా అంటూ 66 పైసలు ఎలా ఇస్తామని రివర్స్ ఎటాక్ చేసే ప్రయత్నం చేశారు. తన దగ్గర 9.34 రూపాయలు వసూలు చేసిన మీరు, కచ్చితంగా వెనక్కి 66 పైసలు ఇవ్వాల్సిందేనని రైతు చొక్కన్న గౌడ నిలదీశాడు.
ఆ డబ్బులు ఇచ్చే దాకా తాను వెళ్ళేది లేదని రచ్చ రచ్చ చేశాడు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. అయితే రైతు మొండి పట్టు పట్టడంతో పది రూపాయలు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వైరల్ కావడంతో నెట్టిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. బ్యాంకు వాళ్లకు బాధిత రైతు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడని... ఇలాగే అందరూ కౌంటర్ ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు. రూ.9.34 కోసం కెనరా బ్యాంకు ఇంత కక్కుర్తి పడుతుందా ? అంటూ మండిపడుతున్నారు.
In Karnataka, a farmer cleared his ₹50,000 loan.Months later, Canara Bank contacted him over an outstanding balance of ₹9.34 😅He paid ₹10 and demanded 66 paise back, saying, "If banks count every paisa from us, shouldn’t we count ours too?" 😂 pic.twitter.com/I7vyAm6DFe— News Algebra (@NewsAlgebraIND) February 27, 2026






