పెళ్లి కూతురు గెటప్‌లో స్పోర్ట్ బైక్ నడిపిన కాజల్.. హై స్పీడ్‌లో సూపర్ డ్రైవింగ్ (వీడియో)

by Disha Web Desk 9 |
పెళ్లి కూతురు గెటప్‌లో స్పోర్ట్ బైక్ నడిపిన కాజల్.. హై స్పీడ్‌లో సూపర్ డ్రైవింగ్ (వీడియో)
X

దిశ, సినిమా: ఇటీవల యువత సోషల్ మీడియాలో ఫేమ్ కావడం కోసం వింత వింత స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంత సమయం వరకు సంతోషాన్నిచ్చిన.. ఈ విన్యాసాలు వారికే కాదు తోటి ప్రయాణికులకు కూడా హాని కలిగిస్తున్నాయి. రీసెంట్‌గా ఓ ప్రేమ జంట స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ.. స్కూటీపైన్నే రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో వీక్షించిన నెటిజన్లు దారుణంగా మండిపడ్డారు.

తాజాగా ఓ అమ్మాయి ఎలాంటి భయం లేకుండా రోడ్‌పై బైక్ నడుపుతోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పైగా ఆమె డ్రైవ్ చేసేది స్పోర్ట్స్ బైక్‌లా కనిపిస్తుంది. పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఆ యువతి టెన్షన్ లేకుండా.. ఎక్స్‌పర్ట్ రైడర్‌లా రోడ్డుపై చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో జనాలు నోరెళ్లబెట్టుకుంటున్నారు. బెంగాల్‌కు చెందిన కాజల్ దత్తా అనే ఈ యువతి నిజంగానే ప్రొఫెషనల్ బైక్ రైడర్‌ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా బైక్ డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియోలే ఉన్నాయి. ఈ వీడియో చూసిన జనాలు పెళ్లి కూతురు గెటప్‌లో సరిగ్గా నడవలేరు, కంఫార్ట్ గా ఫీల్ అవ్వలేరు.. అలాంటిది కాజల్ దత్తా ఈ రేంజ్‌లో బైక్ డ్రైవింగ్ చేస్తుండటం గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరికొందరు చీరలో అలా డ్రైవింగ్ చేయడం సరికాదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed