పేకాట క్లబ్బులు కావాలా..డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా..: యువతకు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

by Disha Web Desk 16 |
పేకాట క్లబ్బులు కావాలా..డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా..: యువతకు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: పేకాట క్లబ్బులు కావాలా.. డీఎస్సీ కావాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ఉంగుటూరులో వారాహి విజయభేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పాఠశాల పుస్తకాలపై జగన్ ఫొటోలు పెట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3 లక్షల 80 వేల మంది విద్యార్థులు స్కూళ్లు మానేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట, మద్యం, ఇసుక దోపిడీ బాగా పెరిగిపోయిందని మండిపడ్డారు. ఐదేళ్లుగా జగన్ బెయిల్ ఉన్నారని, 39 కేసులున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని పవన్ జోస్యం చెప్పారు. పోలీసులు, ఏసీబీపై జగన్ అధిపత్యం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రి సరైనోడా కాదా అనేది చూడాలన్నారు. దోపిడీ చేసే రాజకీయ నాయకులకు కాలేజీలు, స్కూళ్లలో ఏం పని అని ప్రశ్నించారు. క్రిమినల్స్ ను గెలిపిస్తే భవిష్యత్తు అంధకారం అని చెప్పారు. వైసీపీ నాయకుడు వాసు బాబు పేకాట క్లబ్జులను డెవలప్ మెంట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారని పవన్ సెటైర్స్ వేశారు. ఉంగుటూరులో మంచినీటి సమస్య ఉందని, ఈ సమస్యలు పరిష్కరించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఉద్యోగులను జగన్ మోసం చేశారని, మద్యం షాపుల్లో విధులు వేసి అవమానించారని మండిపడ్డారు. చదువు చెప్పే గురువులను గౌరవించాలని సూచించారు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ సమస్యలను పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

Read More..

మళ్లీ జగనే సీఎం అని KCR కామెంట్స్.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్

Next Story

Most Viewed