భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలి భర్త మృతి

by Anjali |
భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలి భర్త మృతి
X

దిశ గుమ్మడిదల: భార్య భర్తలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి భర్త మృతి చెందిన ఘటన జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ రేకుల ఇంట్లో భర్త జయదీప్ మొహకుద్ అతని భార్యతో కలిసి నివాసం ఉంటుంటున్నారు. బుధవారం రాత్రి వీరు నిద్రిస్తున్న సమయంలో ఈ ఇంటికి ఆనుకొని ఉన్న బిల్డింగ్ పై కప్పు రేలింగ్ ఒక్కసారిగా కూలి రేకులపై విరిపై బలంగా పడడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Next Story