బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ గెలిస్తే రిజర్వేషన్‌లు పోతాయి : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 23 |
బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ గెలిస్తే  రిజర్వేషన్‌లు పోతాయి : రంజిత్ రెడ్డి
X

దిశ,మొయినాబాద్ : బీజేపీని గెలిపిస్తే మొదటికే మోసం వస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రిజర్వేషన్లు మాయం అవుతాయని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి జోష్యం చెప్పారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే బిజెపి నాయకులకు గుబులు పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని గత ఐదేళ్లలో నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తను ఆదరించడం జరిగింది అని స్పష్టం చేశారు.ఐదేళ్ల నుంచి ప్రజలను పట్టించుకోని బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు వచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా అందరినీ కలుస్తా అంటే ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అందరికీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల కోసం కూడా మళ్లీ మీ దగ్గరికి వస్తామని మీలో ఎవరికైనా 6 గ్యారెంటీ పథకాలు అమలు కాకపోతే అప్పుడు మమ్మల్ని నిలదీయవచ్చని స్పష్టం చేశారు.ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను రంజిత్ రెడ్డి మరోసారిఓటర్లకు విజ్ఞప్తి చేశారు.కేంద్రం నుండి రావలసిన నిధులను కొట్లాడు తీసుకొస్తానని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తమ్మి ప్రాంతాలలో అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలలో చేతి గుర్తు మీద ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఇంచార్జ్ భీమ్ భరత్, పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ చెంపుల సత్యనారాయణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాబాద్ దర్శన్, సున్నపు వసంతం, మాజీ జడ్పీటీసీ కంజర్ల భాస్కర్, చంద్ర లింగం గౌడ్, మండల అధ్యక్షుడు తమ్మలి మాన్నెయ్య,కొమ్మిడి వెంకట్ రెడ్డి, మాడి వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నవపేట్ మండలం గంగాడ మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నూలి మౌనేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మెత్తల వెంకటయ్య, నూలి శ్రీకాంత్, ఆలూరు శివప్రసాద్, వడ్ల భువనేశ్వర్ చారి, అశోక్ శెట్టి, శివకుమార్, సిహెచ్ మల్లేష్ కుమా,ర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలూరి విట్టల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవి, సాయి కృష్ణ దోసాడ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed