- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Delhi Liquor Scam Case: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కవిత దాఖలు చేసిన పిటిసన్‌పై విచారణ చేపట్టనుంది. అదేవిధంగా సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ, బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పరిణామంతో మరోసారి కవిత ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవితకు కూడా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ మంజూరు చేస్తుందా.. లేక తిరస్కరిస్తుందా అని రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఓ రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది.