జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌ డే.. మేకను బలిచ్చిన ఫ్యాన్స్.. రక్తాభిషేకం.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-20 06:24:18  IST  )

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ చెప్తున్నారు. ఇప్పటికే తారక్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌లో పుట్టినరోజు జరుపుకునేందుకు వెళ్లాడు. ఇదంతా బాగానే ఉన్నా అభిమానుల

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌ డే.. మేకను బలిచ్చిన ఫ్యాన్స్.. రక్తాభిషేకం.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ చెప్తున్నారు. ఇప్పటికే తారక్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌లో పుట్టినరోజు జరుపుకునేందుకు వెళ్లాడు. ఇదంతా బాగానే ఉన్నా అభిమానుల సెలబ్రేషన్స్ శృతి మించాయి. హీరోపై అభిమానం ఉంటే భారీ కటౌట్స్ పెట్టించడం, పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు, దానధర్మాల వరకు ఓకే కానీ ఇప్పుడు చేసిన పని లిమిట్స్ క్రాస్ చేసింది. ఏకంగా మేకను బలిచ్చి తారక్‌ కటౌట్‌కు రక్తాభిషేకం చేశారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈవెన్ అభిమానులు కూడా ఈ పనిని తప్పుపడుతున్నారు.

ఇలాంటివి చేయొద్దని ఇప్పటికే తారక్ చెప్పినా.. మళ్లీ రిపీట్ చేయడం బాగాలేదని, అసలు మీరు అభిమానులేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో తారక్ వరకు రీచ్ అయితే ఇంటికి పిలిచి మరీ క్లాస్ పీకుతాడని హెచ్చరిస్తున్నారు. మీ ప్రేమను వ్యక్తపరచాలంటే ఇంత వైల్డ్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు.. శాంతియుతంగా ఇంకా ఎన్నో దారులున్నాయని అంటున్నారు. ఇలాంటి వాళ్లను జైలులో పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. వీడియో వెంటనే డిలీట్ చేయాలని ఇంకొందరు కోరుతున్నారు.

Click For Tweet..

Next Story