జెఫ్ బెజోస్‌కు షాకిచ్చిన సొంత ఉద్యోగులు.. వందలాది ‘యూరిన్ బాటిల్స్’తో నిరసన

by Kema Shiva Kumar |

మెట్ గాలా 2026లో జెఫ్ బెజోస్ లక్ష్యంగా ఆ సంస్థ ఉద్యగులు ‘యూరిన్ బాటిల్స్’తో నిరసన తెలిపారు.

జెఫ్ బెజోస్‌కు షాకిచ్చిన సొంత ఉద్యోగులు.. వందలాది ‘యూరిన్ బాటిల్స్’తో నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా 2026’ (Met Gala 2026) వేదికపై ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) లక్ష్యంగా నిరసనకారులు సుమారు 300 నకిలీ యూరిన్ బాటిళ్లను వేదిక పరిసరాల్లో ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, అమెజాన్ (Amazon) కంపెనీలో పని చేసే కార్మికుల దుర్భర స్థితిగతులను ప్రపంచానికి చాటిచెప్పేందుకే నిరసనకారులు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అమెజాన్ గోడౌన్లలో పని చేసే కార్మికులు కఠినమైన ప్రొడక్టివిటీ టార్గెట్లను చేరుకోవాల్సి ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా సమయం ఉండదని, అందుకే కార్మికులు బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేయాల్సి వస్తోందని గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి.

అత్యంత ధనవంతులు. ప్రముఖులు పాల్గొనే మెట్ గాలా వంటి వేడుకలో ఈ బాటిళ్లను ఉంచడం ద్వారా, కార్పొరేట్ శక్తుల అధికారం, కార్మికుల వాస్తవిక పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపాలని నిరసనకారులు భావించారు. న్యూయార్క్‌‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ (Metropolitan Museum of Art)లో ఈ వేడుక జరుగుతుండగా, సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న సమయంలోనే వేదిక లోపల వివిధ చోట్ల చిన్న యూరిన్ బాటిళ్లను నిరసనకారులు ప్రదర్శించారు. అయితే, వీటిని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ లక్ష్యంగా ఏర్పాటు చేసిన యూనిన్ బాటిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story