- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jeevan Reddy: మా కంటే.. మీ సంపాదనే బెటర్: చిన్నారులతో జీవన్ రెడ్డి చిట్‌చాట్ (వీడియో వైరల్)
పండుగలకు పెట్టింది పేరు తెలంగాణ (Telangana) పల్లెలు.

దిశ, వెబ్‌డెస్క్: పండుగలకు పెట్టింది పేరు తెలంగాణ (Telangana) పల్లెలు. పాలు తాగే పిల్లాడి నుంచి పండు ముసలి వరకు సందడి చేస్తూ పండగలకు శోభను తీసుకొస్తారు. ఇక పల్లె పదాలతో ఫాల్గుణ మాసంలో వచ్చే రంగుల పండగ ‘హోలీ’ (Holi) గురించి ఇక స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అయితే, రంగుల పండుగ వేళ గ్రామాల్లో జాజిరి పాటలు మారుమోగిపోతున్నాయి. ఉత్సాహంగా పాటలు పడుతూ.. ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జగిత్యాల (Jagityal)లో చిన్నారులు జాజిరి పాటలు పాడుకుంటూ ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇంటికి వెళ్లారు. ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డబ్బులిమ్మని చిన్నారులు జీవన్ రెడ్డిని అడగ్గా.. ఆయన ఇప్పటి వరకు మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారో చూపించాలని వారిని రిక్వెస్ట్ చేశారు. దీంతో వారంతా జేబుల్లో ఉన్న చిల్లరను బయట టేబుల్‌పై వేసి ఆయనకు చూపించారు. ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు జమ చేశారని చిన్నారులను ప్రశ్నించగా.. వారు రూ.500 అంటూ సమాధానమిచ్చారు. అది విన్న జీవన్ రెడ్డి (Jeevan Reddy) మా కంటే.. మీరే సంపాదనే బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఆఖరికి ఆయన జేబులోంచి రూ.100 ఇచ్చి దాచుకోండని పిల్లలకు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతంది.






