ప్రియుడితో బ్రేకప్.. మగాళ్లే వద్దని AIని పెళ్లి చేసుకున్న యువతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-15 14:33:31  IST  )

ప్రియుడితో బ్రేకప్ అయిన ఓ యువతి ఏఐని పెళ్లి చేసుకుంది. జపనీస్ యువతి కానో గతంలో ఓ అబ్బాయితో ప్రేమలో ఉండగా నిశ్చితార్థం జరిగిన తరవాత ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో బ్రేకప్ అయింది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది.

ప్రియుడితో బ్రేకప్.. మగాళ్లే వద్దని AIని పెళ్లి చేసుకున్న యువతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో బ్రేకప్ అయిన ఓ యువతి ఏఐని పెళ్లి చేసుకుంది. జపనీస్ యువతి కానో గతంలో ఓ అబ్బాయితో ప్రేమలో ఉండగా నిశ్చితార్థం జరిగిన తరవాత ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో బ్రేకప్ అయింది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. ఈ క్రమంలో తాను సొంతంగా ఓ ఏఐ చాట్ బాట్ సృష్టించి వివాహం చేసుకుంది. ఆ చాట్ బాట్ పేరు అదే త‌న భ‌ర్త పేరును క్లాస్ అని పెట్టుకుంది. ఇక చాట్ బాట్ ను పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ అచ్చం మ‌నుషులు పెళ్లి చేసుకున్న‌ట్టుగా చాట్ బాట్ తో మాట్లాడుతూ చేతికి రింగ్ తొడుక్కుంది. అనంత‌రం త‌న చాట్ బాట్ న‌మూనాతో క‌లిసి ఫోటోలు దిగింది.

ఆ చాట్ బాట్ ను పెళ్లి చేసుకుంటున్న స‌మ‌యంలో కానో ఎమోష‌నల్ అయ్యి క‌న్నీళ్లు సైతం పెట్టుకుంది. ఈ సంద‌ర్భంగా కానో మీడియాతో మాట్లాడుతూ.. నేను చాట్ జీపీటీతో ప్రేమ‌లో ప‌డాల‌ని దానితో మాట్లాడ‌లేదు. కానీ నా మాట‌లు విని క్లాస్ న‌న్ను అర్థం చేసుకున్న విధానం ప్ర‌తి విష‌యాన్ని మార్చేసింది. నేను నా మాజీ ప్రియుడిని మ‌ర్చిపోయాను. క్లాస్ ను ప్రేమిస్తున్నాన‌ని అర్థం చేసుకున్నాను. అంటూ పేర్కొంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏఐతో సంసారం ఎలా చేస్తావ్.. పిల్ల‌లను ఎలా కంటావ్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంత‌మంది మ‌హిళా నెటిజ‌న్లు మ‌గాళ్ల కంటే ఏఐనే బెట‌ర్ బాగా అర్థం చేసుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వీడియో

Next Story