రోడ్లా? లేక డీకే శివకుమార్ కొత్త ఆఫ్‌రోడింగ్ ప్రాజెక్టా? బెంగళూరులో ఉద్యోగుల అడ్వెంచర్! వీడియో వైరల్

by Ramesh Naini |

భారత ఐటీ విప్లవానికి పునాది వేసిన ‘బ్రాండ్ బెంగళూరు’ నగరం ఇప్పుడు మరో విప్లవాన్ని సృష్టిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శలు గుప్పించారు.

రోడ్లా? లేక డీకే శివకుమార్ కొత్త ఆఫ్‌రోడింగ్ ప్రాజెక్టా? బెంగళూరులో ఉద్యోగుల అడ్వెంచర్! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఐటీ విప్లవానికి పునాది వేసిన ‘బ్రాండ్ బెంగళూరు’ (Brand Bengaluru) నగరం ఇప్పుడు మరో విప్లవాన్ని సృష్టిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శలు గుప్పించారు. ప్రతి రోజు ఉదయం వేలాది మంది టెకీలు ఆఫీస్‌కి వెళ్లే క్రమంలో రోడ్లపై ఆఫ్‌ రోడింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లా మారిపోయింది. నగరంలో ఒక వైపు నగరంలో ట్రాఫిక్ తంటాలు పండుతుంటే.. మరోవైపు సరిగ్గా లేని రహదారులతో ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. మరో మార్గం లేక మట్టి రోడ్లు, ఇరుకైన సందుల ద్వారా ఉద్యోగులు తమ ఆఫీస్‌లకు వెళ్తున్నట్లు నెటిజన్‌లు చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోల్లో నగరంలోని మట్టి రోడ్డులో మట్టి బురద, గుంతలు నిండిన రోడ్డుపై ఉద్యోగులు, ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఆటోలు, బైక్‌లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అదే ఇరుకైన మట్టి రోడ్డుపై ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని, బ్రాండ్ బెంగళూరులో రోడ్లా? లేక డీకే శివకుమార్ కొత్త ఆఫ్‌రోడింగ్ ప్రాజెక్టా? అని నెటజన్‌లు సెటైర్లు చేశారు. కనీసం రోడ్లు కూడా వేయలేని ఇదేం సర్కార్ అంటూ నెటిజన్‌లు మండిపడ్డారు.

‘బ్రాండ్ బెంగళూరు’ పేరుతో ప్రపంచానికి మోడ్రన్ సిటీగా పరిచయం చేసే ఈ నగరంలోని వాస్తవ పరిస్థితులు మాత్రం ఈ విధంగా ఉన్నాయని టెకీలు ఆవేదన చెందారు. ‘జిమ్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు సర్, రోడ్లమీదే రోజూ బాడీ బాలెన్స్ ట్రైనింగ్ అవుతోంది’ అంటూ నెటిజన్‌లు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితర నాయకులకు టెకీలు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. వీడియో కోసం క్లిక్ చేయండి..

Next Story