Love:‘ప్రేమ’ సక్సెస్ కావాలంటే ‘లవ్ లాక్’ వేయాల్సిందే! అసలు విషయం ఇదే?

by Jakkula.Mamatha |

‘ప్రేమ(Love)’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Love:‘ప్రేమ’ సక్సెస్ కావాలంటే ‘లవ్ లాక్’ వేయాల్సిందే! అసలు విషయం ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రేమ(Love)’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినడానికి రెండు అక్షరాలైనప్పటికీ రెండు మనసులను దగ్గర చేస్తోంది. ఇక, ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టమే. ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రేమకు ప్రతీక అనగానే టక్కున గుర్తొచ్చేది తాజ్ మహల్. ఇక్కడికి తమ ప్రేయసితో వెళ్లి ఫొటో దిగాలని, ఆనందంగా గడపాలని చాలా మంది ప్రేమికులు ఆశపడుతుంటారు. అయితే, ఎంతో మంది లవర్స్ తమ ప్రేమ విఫలం కాకూడదని, పెళ్లితో శాశ్వతంగా ఒకటిగా జీవించాలని కోరుకుంటారు.

ఈ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా వారి ప్రేమ సఫలం అవుతుందనే నమ్మకం ఉండదు. అందుకే, కొందరు ప్రేమికులు తమ లవ్ సక్సెస్ అవ్వాలని ఆలయాలకు వెళ్తుంటారు. అంతేకాదు ఫలనా ఆలయానికి వెళితే ప్రేమలో విజయం పొందుతామని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఆయా గుళ్లకు వెళ్లి ప్రేమ పెళ్లికి గమ్యం కావాలని కోరుకుంటారు. అచ్చం ఇలాంటిదే ప్రేమ సక్సెస్ కోసం పారిస్ లో మరో సంప్రదాయం ఉందంట.

అది ఏంటంటే.. పారిస్ లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకునే జంటలు తాళాలు వేసి వాటి ‘కీ’లను సీన్ నదిలో పడేసే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఈ సమయంలో ప్రేమ జంటలు తమ బంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో ఈ వంతెన భావోద్వేగాలకు నిలయంగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వేలాది ప్రేమ జంటలు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి తాము ప్రేమ జీవితంలో ఎప్పుడు విజయం పొందాలనే ఎమోషనల్ అవుతుంటారు.

ఈ సంప్రదాయం పారిస్‌కు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచింది. అయితే, క్రమక్రమంగా ఈ ‘లవ్ లాక్స్’ సంఖ్య పెరిగి, వాటి బరువు కారణంగా వంతెన కూలిపోయే ప్రమాదముందని పారిస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2015లో ప్రభుత్వం అప్రమత్తమై వంతెనపై ఉన్న వేలాది తాళాలను తొలగించి తాళాలు వేయడాన్ని పూర్తిగా నిషేధించింది. కానీ, వాటి స్థానంలో సురక్షితమైన అందమైన గాజు ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ గాజు ప్యానెళ్లు వంతెన అందాన్ని ఏ మాత్రం తగ్గించకుండా, సీన్ నది, పరిసర ప్రాంత దృశ్యాలను మరింత అందంగా కనిపించే విధంగా చేశాయి.

Next Story