VIDEO VIRAL: యూట్యూబ్ ట్రెండింగ్ "బావిలోనే బల్లిపలికే" పాటను అక్కడ నుండి కాపీ కొట్టారా?

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం యూట్యూబ్ లో సింగర్ మంగ్లీ చేసిన బావిలోనే బల్లి పలికే అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాట‌ను ఓ బిహారీ పాట నుండి కాపీ కొట్టిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

VIDEO VIRAL: యూట్యూబ్ ట్రెండింగ్ బావిలోనే బల్లిపలికే పాటను అక్కడ నుండి కాపీ కొట్టారా?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య తెలంగాణ జాన‌ప‌ద పాట‌లు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఏ కొత్త పాట వచ్చినా మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వస్తున్నాయి. ఒకటి రెండు కాకుండా ఏకంగా వందల మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. ఏ పార్టీ జరిగినా.. ఫంక్షన్ జరిగినా అవే పాటలను మోగిస్తున్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో సింగర్ మంగ్లీ చేసిన బావిలోనే బల్లి పలికే అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటను స్వయంగా మంగ్లీ పాడటంతో పాటు వీడియోలో స్టెప్పులు వేశారు.

నెల రోజుల క్రితం పాట‌ను విడుద‌ల చేయ‌గా ఇప్పటి వ‌ర‌కు 60 మిలియ‌న్ల‌కు పైగా వ్యూవ్స్ వ‌చ్చాయి. అయితే తాజాగా ఈ పాట‌ను ఓ బిహారీ పాట నుండి కాపీ కొట్టిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నౌర మ‌జా దారుద్యా అనే పాట నుండి బావిలోనే బ‌ల్లిప‌లికే పాట‌ను లేపేశార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు పాటల మ్యూజిక్ అచ్చుగుద్దిన‌ట్టు ఒకేలా ఉంది. దీంతో బిహారీ పాట నుండి బావిలోనే పాట‌ను కాపీ కొట్టార‌ని కానీ రెండు బాగున్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story