యోగా అంటే శ్వాస మీద ధ్యాస.. ఆ అమ్మాయి పేరు శ్వాస అనుకుంటా.. హిలేరియస్ ఫొటో వైరల్.. చూస్తే కడుపుబ్బ నవ్వేస్తరు..

by Sujitha Rachapalli |

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా చూశారా? అందులో హీరోయిన్ ధ్యాన మందిరానికి వెళ్తే ఆమె కోసం అక్కడికి వెళ్తాడు హీరో. అందరూ యోగా, ప్రాణాయామం, ఆసనాలు చేస్తుంటే.. హీరో మాత్రం హీరోయిన్‌ను చూస్తూనే ఉండిపోతాడు.

యోగా అంటే శ్వాస మీద ధ్యాస.. ఆ అమ్మాయి పేరు శ్వాస అనుకుంటా.. హిలేరియస్ ఫొటో వైరల్.. చూస్తే కడుపుబ్బ నవ్వేస్తరు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా చూశారా? అందులో హీరోయిన్ ధ్యాన మందిరానికి వెళ్తే ఆమె కోసం అక్కడికి వెళ్తాడు హీరో. అందరూ యోగా, ప్రాణాయామం, ఆసనాలు చేస్తుంటే.. హీరో మాత్రం హీరోయిన్‌ను చూస్తూనే ఉండిపోతాడు. మధ్యలో వచ్చిన బ్రహ్మానందం ఏం చేస్తున్నావ్‌రా అంటే పాపం కొట్టి కొట్టి పెడ్తడు. అచ్చం ఇలాంటి కామెడీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ హిలేరియస్ ఫొటో క్లిక్ చేశారు ఎవరో బ్రహ్మానందం లాంటి వారు.

కాగా యోగా డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో కళ్లు మూసుకుని శ్వాసపై ధ్యాస పెట్టేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న అందమైన అమ్మాయి.. చుట్టూ ఉన్నవాళ్లు అందరూ అదే చేశారు.. ఒక్క పక్కనున్న అబ్బాయి తప్ప. అందరూ కళ్లపై చేతులు పెట్టుకుంటే అతను మాత్రం.. ఈ అమ్మాయినే చూస్తూ ఉండిపోయాడు. దీంతో నెట్టింట పిక్ వైరల్ అవుతోంది. యోగా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి.. అమ్మాయి మీద కాదని ఒకరు కామెంట్ చేస్తే.. ఆ అమ్మాయి పేరు శ్వాస ఏమో మరి ఇంకొందరు రిప్లయ్ ఇస్తున్నారు.

LINK

Next Story