- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాలో ప్రేమాయణం.. ముఖం చూడకుండా పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్
సోషల్ మీడియా యుగంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో అయితే ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే చదువుకునేటప్పుడో, లేదంటే బయట పరిచయమైనవారినో ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా యుగంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో అయితే ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే చదువుకునేటప్పుడో, లేదంటే బయట పరిచయమైనవారినో ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో పరిచయం అవ్వడం తరవాత ప్రేమలో మునిగితేలడం.. తరవాత ఏకంగా పెళ్లికి సిద్ధం అవ్వడం. ఇలాంటి కేసులే కనిపిస్తున్నాయి. అయితే అలా ముక్కు, మొహం తెలియనివాళ్లను ప్రేమించడం ద్వారా అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారు. ఇద్దరి మధ్య సరైన అవగాహన లేక కొందరు విడిపోతుంటే మరికొందరు పెళ్లికి ముందే విడిపోతున్నారు.
తాజాగా సోషల్ మీడియా ప్రేమలు ఎలా ఉంటాయో తెలిపేలా ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇన్ స్టాలో ఓ యువకుడితో ప్రేమలో పడిన యువతి అతడిని బయట కలవకుండానే పెళ్లికి ఓకే చెప్పేసింది. చివరికి పెళ్లికి సిద్ధమై అన్నీ రెడీ చేసుకున్న తరవాత పెళ్లిమండపంలో అతడిని చూసి షాక్ అయ్యింది. యూపీలోని హోర్డోయ్ కి చెందిన యువతికి ఇన్ స్టాలో దేవేందర్ సింగ్ పరిమార్ అనే యువకుడి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజులకు ప్రేమగా మారింది. తరవాత ఇద్దరు ఫోటోలు పంపుకోవడం చేశారు కానీ నేరుగా కలుసుకోలేదు. ఈ క్రమంలో యువతి చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకుంటా లేదంటే చస్తానని ఇంట్లో వాళ్లను బెదిరించడం మొదలుపెట్టింది.
ఇక కూతురి ఆనందం కంటే తమకు మరేది ఎక్కువకాదని భావించిన పేరెంట్స్ పెళ్లికి ఓకే చెప్పి, పెళ్లి పనులు కూడా పూర్తి చేశారు. అయితే తీరా పెళ్లి మండపానికి వచ్చిన తరవాత తాను చూసిన అబ్బాయి ఇతను కాదు అంటూ యువతి గొడవ చేయడం మొదలు పెట్టింది. తాను మాట్లాడింది రాహుల్ అనే వ్యక్తితో అని చెప్పింది. మధ్యలో ఈ వ్యక్తి పెళ్లికొడుకు వేషంలో ఎంటర్ అయ్యాడని పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగ్గా అబ్బాయిపై దాడి చేసి గాయపర్చారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి యువతి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది.






