ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోవడంతో భర్తపై కేసు పెట్టిన భార్య.. చివరకు పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ అదిరింది...

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-14 07:11:18  IST  )

ప్రయారిటీస్ మారుతున్నాయంటే ఏమో అనుకున్నాం కానీ మరీ ఇంతగా మారుతున్నాయని ఈ ఇన్సిడెంట్ విన్నాకే అర్థమవుతోంది. సోషల్ మీడియా వైవివాహిక బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన హైలెట్ చేస్తోంది.

ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోవడంతో భర్తపై కేసు పెట్టిన భార్య.. చివరకు పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ అదిరింది...
X

దిశ, ఫీచర్స్ : ప్రయారిటీస్ మారుతున్నాయంటే ఏమో అనుకున్నాం కానీ మరీ ఇంతగా మారుతున్నాయని ఈ ఇన్సిడెంట్ విన్నాకే అర్థమవుతోంది. సోషల్ మీడియా వైవివాహిక బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన హైలెట్ చేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని హపూర్‌కు చెందిన నిషా.. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త విజేంద్రా ఇంటి పని చేయమని ఒత్తిడి చేయడం వల్ల రీల్స్ చేయడానికి సమయం దొరకట్లేదని.. అందుకే ఫాలోవర్స్ తగ్గారని ఆరోపించింది. ఇక భర్తతో ఉండలేనని.. ఈ డొమెస్టిక్ వాయిలెన్స్ తట్టుకోలేనని.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే విజేంద్రా కూడా కౌంటర్ ఫిర్యాదు చేశాడు. నిషా ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటుందని.. ఇంటి బాధ్యతలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు.

దీంతో భార్యాభర్తలు ఇద్దరినీ పిలిచిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వ్యక్తిగత ఆసక్తులు, వైవాహిక బాధ్యతల మధ్య సమతుల్యత గురించి వివరించారు. వివాహ బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలిపారు. కాగా ఈ ఇన్సిడెంట్ మోడ్రన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం, సాంప్రదాయ బాధ్యతల మధ్య సంఘర్షణను ఎత్తి చూపుతుంది. ఫాలోవర్స్ కోల్పోవడంతో నిషా బాధపడటం ఆన్‌లైన్ ఉనికి, ఆత్మగౌరవంపై ఎలా ప్రభావం చూపుతుందో సూచిస్తుంటే... అదే సమయంలో విజేంద్రా ఫిర్యాదు గృహ బాధ్యతలలో నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. కౌన్సెలింగ్ ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారంగా మారింది. ఎందుకంటే వ్యక్తిగత వివాదాన్ని చట్టపరమైన సమస్యగా మార్చకుండా.. కమ్యూనికేషన్, రాజీపడటం పరిష్కరిస్తుంది. మొత్తానికి తప్పు తెలుసుకున్న దంపతులు మళ్లీ ఒక్కటైనట్లు తెలుస్తోంది.

Next Story