కొంపముంచుతున్న కొత్త ట్రెండ్.. పుట్టుమచ్చలు సైతం స్కాన్ చేస్తున్న ఏఐ.. !

by Ajay Maddhiboyina |

సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా వచ్చిందంటే చాలు నెటిజన్లు అంతా ఎగబడిపోతుంటారు. తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నామని చెప్పడానికి చుట్టాలు, స్నేహితులు ఏం చేస్తేరో వీళ్లు కూడా అదే చేస్తారు. అయితే ప్రస్తుతం ఏఐ ఇమేజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

కొంపముంచుతున్న కొత్త ట్రెండ్.. పుట్టుమచ్చలు సైతం స్కాన్ చేస్తున్న ఏఐ.. !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా వచ్చిందంటే చాలు నెటిజన్లు అంతా ఎగబడిపోతుంటారు. తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నామని చెప్పడానికి చుట్టాలు, స్నేహితులు ఏం చేస్తేరో వీళ్లు కూడా అదే చేస్తారు. అయితే ప్రస్తుతం ఏఐ ఇమేజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జెమిని ఏఐ నానో బనానో అనే ఇమేజ్ క్రియేషన్ తీసుకురాగా ప్రతి ఒక్కరూ దానిని ఫోలో అవుతున్నారు. ఫ్రీనే కదా అని తమ ఫోటోలను జెమిని ఏఐలో అప్లోడ్ చేసి నచ్చినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అయితే నానో బనానో శారీతో ఇమేజ్ జనరేట్ చేసిన జలక్ భవానీ అనే అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది.

తాను సాధారణ డ్రెస్ తో ఇచ్చి ఫోటోను శారీలో జనరేట్ చేయాలని కోరగా అందులో యువతి భుజంపై పుట్టుమచ్చ కనిపించింది. కానీ ఒరిజనల్ ఇమేజ్ మాత్రం అలా లేదు. యువతి శరీరంపై పుట్టుమచ్చ ఉన్నప్పటికీ తాను ఇచ్చిన ఇమేజ్ లో అది లేకపోవడంతో జనరేటెడ్ పిక్‌లో ఎలా కనిపించిందని ఆందోళన చెందుతూ వీడియో చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాలో ప్టోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం అమ్మాయి పుట్టుమచ్చను ఏఐ గుర్తించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ విషయాలను ఏఐ సేకరిస్తుంది, కాబట్టి అందులో అసలు ఫోటోలు అప్లోడ్ చేయవచ్చని చర్చించుకుంటున్నారు. వైరల్ వీడియో

Next Story