- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి డిస్కౌంట్ ఎక్కడా చూసి ఉండరు.. బట్టల కోసం ఎగబడ్డ జనం
by Gantepaka Srikanth |
ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చినా పెద్దగా ఆశ పడని జనాలు బట్టల షాపులో డిస్కౌంట్ అంటే మాత్రం ఎగబడి పోతుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చినా పెద్దగా ఆశ పడని జనాలు బట్టల షాపులో డిస్కౌంట్ అంటే మాత్రం ఎగబడి పోతుంటారు. పండగ సీజన్‌లో అయితే అస్సలే ఊరుకోరు. జతలకు జతలు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి(Sankranti) పండుగ వేళ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జీఎల్‌ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం వినూత్న డిస్కౌంట్ ప్రకటించింది. మనిషి బరువును బట్టి వినూత్నంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. షాపింగ్ మాల్‌లో వెయిట్ మిషన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. బట్టలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వెయింగ్ మిషన్‌పై వారి బరువును తూకం వేస్తారు. వారు ఉన్న బరువులో సగం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇలా 70 కేజీల బరువున్నవారికి 35 శాతం, 80 కేజీలు ఉన్నవారికి 40 శాతం, 100 కేజీలు ఉన్న వారికి 50 శాతం వారుకొన్న బట్టలపై డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో జనం ఎగబడిపోయారు.
Next Story






