కూలిన పాక్ విమానాన్ని లేపుకొస్తున్న భారత యుద్ద విమానం.. నెట్టింట ఫోటోలు వైరల్

by Ramesh Goud |

భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కూలిన పాక్ విమానాన్ని లేపుకొస్తున్న భారత యుద్ద విమానం.. నెట్టింట ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ (Operaytion Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakisthan) ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. దీంతో గురువారం పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ సరిహద్దు రాష్ట్రాలపై దాడికి యత్నించింది. ఈ దాడిని గుర్తించిన భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది.

పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను సరిహద్దులలోనే కూల్చిపడేసింది. అంతేగాక పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు నగరాలపై దాడి చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కూలిపోయిన పాక్ ఎయిర్ ఫోర్స్ (Pak Air Force) విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) విమానం గాల్లో లేపుకొని వెళుతున్నట్టుగా ఉన్న ఫోటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ ఫోటోపై గురువారం భారత ఆర్మీ పేల్చివేసిన పాక్ ఎయిర్ ఫోర్స్ విమానం జమ్మూ కశ్మీర్ పొలాల్లో పడిపోయిందని, దానిని భారత ఐఏఎఫ్ విమానం తీసుకొని వస్తుందని చెబుతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ను తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. భారత ఆర్మీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఫోటో ఫేక్ అని, ఇలాంటి ఫేక్ ఫోటోలను స్ప్రెడ్ చేయడం మంచిది కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story