స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.. మన జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆలపించిన అమెరికన్

by Yella Dhawani Reddy |

దేశవ్యాప్తంగా ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసిన మువ్వెన్నల జెండా రెపరెపాలాడుతూ, దేశభక్తి ఉప్పొంగే వాతావరణం నెలకొంది.

స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.. మన జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆలపించిన అమెరికన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 15.. కుల, మతాలతో సంబంధం లేకుండా భారతదేశ ప్రజలంతా ఒక్కటై గర్వంగా జరుపుకునే పండుగ రోజు. దేశవ్యాప్తంగా ఇవాళ 79వ స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసిన మువ్వెన్నల జెండా రెపరెపాలాడుతూ, దేశభక్తి ఉప్పొంగే వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ ఆసక్తికరమైన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మన జాతీయ గీతాన్ని (National Anthem) ఓ అమెరికన్ టీనేజర్ అద్భుతంగా ఆలపించాడు.

అమెరికాకు (America) చెందిన 17 ఏళ్ల గాబే మెలోధీ అనే యువకుడు తాజాగా భారత జాతీయ గీతం 'జన గణ మన'ని అద్భుతంగా పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను దిషా పాన్సూరియా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసింది. గాబే అనేక దేశాల జాతీయ గీతాలను నేర్చుకున్నాడని, కానీ అతడికి భారత దేశ జాతీయ గీతం అంటే ప్రత్యేకమైన అనురాగం అంటే ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఇది నిజంగా భారతీయులకు గర్వకారణం' అంటూ కామెంట్లు పెడుతూ, వీడియోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, భారత జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో 'భారతో భాగ్యో బిధాత'గా బెంగాలీ భాషలో రచించారు. దీన్ని 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ జాతీయ గీతంగా ఆమోదించింది.

Next Story